‘ఒక పథకం ప్రకారం’.. పూరీ తమ్ముడి సినిమా స్టార్టింగ్ టూ ఎండింగ్ సీటు అంచున కూర్చోబెట్టేలా ఉంటుందట !

‘ఒక పథకం ప్రకారం’.. పూరీ తమ్ముడి సినిమా  స్టార్టింగ్ టూ ఎండింగ్ సీటు అంచున కూర్చోబెట్టేలా ఉంటుందట !

సాయిరామ్ శంకర్ హీరోగా వస్తున్న చిత్రం ‘ఒక పథకం ప్రకారం’.  మలయాళ దర్శకుడు వినోద్ కుమార్ విజయన్.. గార్లపాటి రమేష్ తో కలిసి నిర్మిస్తూ దర్శకత్వం వహించాడు.  ఫిబ్రవరి 7న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత వినోద్ కుమార్ విజయన్ మాట్లాడుతూ ‘చిన్న వయసులోనే కెరీర్‌‌‌‌ ప్రారంభించిన నేను దర్శకనిర్మాతగా మలయాళంలో పలు చిత్రాలను తెరకెక్కించాను.  ఫహద్ ఫాజిల్‌‌,  గోపీ సుందర్ లాంటి వారిని పరిచయం చేశా. నేను తీసిన చిత్రాలకు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి.  తెలుగు సినిమా చేయాలనే కోరిక ఈ చిత్రంతో నెరవేరింది. ఇది స్క్రీన్‌‌ప్లే బేస్డ్‌‌ సినిమా.

ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు సీటు అంచున కూర్చోబెట్టేలా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది.  సాయిరాం శంకర్ కొత్తగా కనిపిస్తాడు. మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్ర అయినప్పటికీ సెటిల్డ్‌‌గా నటించాడు. శృతి సోధి, ఆషిమా నర్వాల్, సముద్రఖని పాత్రలు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్‌‌లో విలన్ ఎవరో కనిపెట్టిన వారికి  మొదటి షోలో థియేటర్‌‌‌‌కు ఒకరికి చొప్పున రూ.10 వేలు ఇవ్వబోతున్నాం’ అని తెలియజేశాడు.