నష్టాలను తగ్గించుకోవడానికి వెయ్యి మందిని తీసేయనున్న ఓలా

నష్టాలను తగ్గించుకోవడానికి వెయ్యి మందిని తీసేయనున్న ఓలా

న్యూఢిల్లీ: నష్టాలను తగ్గించుకోవడానికి సుమారు వెయ్యి మంది ఉద్యోగులను తీసేయడానికి  ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ రెడీ అవుతోంది. కిందటేడాది 500 మందిని తొలగించింది. రీస్ట్రక్చరింగ్‌‌తో పాటు, ఆటోమేషన్ కారణంగా ఉద్యోగులను కంపెనీ తగ్గించుకుంటోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.

ప్రొడక్టివిటీని మెరుగుపరుచుకోవడానికి, కస్టమర్లకు మెరుగైన సర్వీస్‌‌ను అందించేందుకు, అలానే మార్జిన్స్‌‌ మెరుగుపరుచుకోవడానికి, ఖర్చులు తగ్గించుకోవడానికి రీస్ట్రక్చరింగ్ చేపట్టామని కంపెనీ స్పోక్స్‌‌పర్సన్ పేర్కొన్నారు. ఆటోమేషన్‌‌తో ఫ్రంట్‌‌ ఎండ్‌‌లో అవసరం లేని ఉద్యోగాలను తీసేస్తున్నామని అన్నారు. కంపెనీ ఇప్పటికే  దేశం మొత్తం మీద రీజినల్ వేర్‌‌‌‌హౌస్‌‌లను తొలగించింది. తనకున్న 4 వేల రిటైల్ స్టోర్లను బండ్లను దాచడానికి వాడుతోంది.