ఓలా కారు ఇప్పట్లో లేనట్టే!

ఓలా కారు ఇప్పట్లో లేనట్టే!

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలని ప్లాన్ చేసిన ఓలా ఎలక్ట్రిక్‌‌‌‌ ప్రస్తుతానికి ఈ ప్లాన్‌‌‌‌ను పక్కన పెట్టింది. స్కూటర్లు,  బైక్‌‌‌‌లపై ఫోకస్ పెట్టాలని కంపెనీ చూస్తోందని  రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. పూర్తిగా గ్లాస్ రూఫ్‌‌‌‌తో, గంటకు 100 కి.మీ స్పీడ్‌‌‌‌తో వెళ్లే  ఎలక్ట్రిక్ స్పోర్ట్స్‌‌‌‌ కారును తీసుకొస్తామని 2022 లో ఓలా ఫౌండర్ భవీష్ అగర్వాల్ ప్రకటించారు.

 రెండేళ్లలోనే మొదటి కారును లాంచ్ చేస్తామని అప్పుడు చెప్పారు. దేశంలో సరిపడినంత ఛార్జింగ్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడంతోనే ఓలా వెనక్కి తగ్గిందని రాయిటర్స్ పేర్కొంది. మరోవైపు ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే వేగంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌‌‌‌ నాటికి మొత్తం 4,83,000 ఈ–స్కూటర్లు అమ్ముడుకాగా, ఇదే టైమ్‌‌‌‌లో 45 వేల ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే  సేల్ అయ్యాయి