ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ బుధవారం రోడ్‌స్టర్ ఎక్స్ సిరీస్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ను లాంచ్ చేసింది. ఇవి 2.5కిలోవాట్ అవర్, 3.5కిలోవాట్ అవర్, 4.5 కిలోవాట్ అవర్ వేరియంట్లలో వస్తాయి. ధరలు వరుసగా రూ. 74,999, రూ. 84,999, రూ. 94,999గా ఉంటాయి.
రోడ్‌స్టర్ ఎక్స్‌ప్లస్ 4.5కిలోవాట్ అవర్ ధర రూ. 1,04,999 కాగా, రోడ్‌స్టర్ ఎక్స్‌ప్లస్ 9.1కిలోవాట్ అవర్ ధర రూ.1.55 లక్షలు. ఇది ఒక్క చార్జ్తో 501 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. రోడ్‌స్టర్ సిరీస్ బైక్స్పై 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ ఉంటుంది. డెలివరీలు మార్చి మధ్య నుంచి ప్రారంభమవుతాయి.