ఓలా స్కూటర్లపై రూ.26,750 వరకు డిస్కౌంట్‌‌‌‌

ఓలా స్కూటర్లపై  రూ.26,750 వరకు డిస్కౌంట్‌‌‌‌

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీ కంపెనీ ఓలా హోలీ సందర్భంగా ఎస్‌‌‌‌ 1 మోడల్స్‌‌‌‌పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఎస్‌‌‌‌1 ఎయిర్‌‌‌‌‌‌‌‌ స్కూటర్‌‌‌‌‌‌‌‌పై రూ.26,750 వరకు, ఎస్‌‌‌‌1 ఎక్స్‌‌‌‌+ (జెన్‌‌‌‌2) పై రూ.22 వేల వరకు డిస్కౌంట్‌‌‌‌ను ఆఫర్ చేస్తోంది. ఎస్‌‌‌‌ ఎయిర్ ధర రూ.9‌‌‌‌‌‌‌‌0 వేల నుంచి, ఎస్‌‌‌‌1 ఎక్స్‌‌‌‌+ ధర రూ.83 వేల నుంచి మొదలవుతాయి. 

ఈ ఫ్లాష్ సేల్‌‌‌‌ మార్చి 13 నుంచి మార్చి 17 వరకు ఓపెన్‌‌‌‌లో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇతర ఎస్‌‌‌‌1 మోడల్స్‌‌‌‌పై కూడా రూ.25 వేల వరకు డిస్కౌంట్‌‌‌‌ను ప్రకటించింది. తాజా ఆఫర్లతో ఎస్‌‌‌‌1 జెన్‌‌‌‌2 బండిని రూ.70 వేల నుంచే పొందొచ్చు. ఎస్‌‌‌‌1జెన్‌‌‌‌3 ధర రూ.1.80 లక్షల నుంచి మొదలవుతుంది.