న్యూఢిల్లీ: ఐపీఓలో ఒక్కో షేరుని రూ. 72– రూ.76 ప్రైస్ రేంజ్‌లో ఓలా ఎలక్ట్రిక్ అమ్మనుంది. కంపెనీ పబ్లిక్ ఇష్యూ వచ్చే నెల 2 న ఓపెన్ కాగా, 6 న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల ఇష్యూ ఆగస్టు 1న ఉంటుంది. ఐపీఓలో ఫ్రెష్‌గా షేర్లను ఇష్యూ చేయడం ద్వారా రూ.5,500 కోట్లను ఓలా ఎలక్ట్రిక్ సేకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) కింద మరో రూ.645.96 కోట్ల విలువైన షేర్లను అమ్మనున్నారు. మొత్తం ఐపీఓ సైజ్ రూ.6,145.96 కోట్లు.
అప్పర్ ప్రైస్ బ్యాండ్ దగ్గర ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ క్యాప్ రూ.33,500 కోట్లుగా ఉంది. కంపెనీ ఫౌండర్ భవీష్ అగర్వాల్ 3.79 కోట్ల షేర్లను, ఇండస్ ట్రస్ట్ 41.79 లక్షల షేర్లను ఓఎఫ్‌ఎస్ కింద అమ్ముతారు. అతిపెద్ద షేర్ హోల్డర్ అయిన ఎస్‌వీఎఫ్2 ఆస్ట్రిచ్ (డీఈ) ఎల్‌ఎల్‌సీ తనకున్న 8.1 కోట్ల షేర్లలో (21.98 శాతం వాటా) 2.38 కోట్ల షేర్లను అమ్మనుంది. ఇతర షేర్ హోల్డర్లు అయిన ఆల్ఫా వేవ్ వెంచర్స్ 2, ఆల్ఫైన్ ఆపర్చునిటీస్ ఫండ్6, ఇంటర్నెట్ ఫండ్ 3, మాక్‌రిట్చీ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా షేర్లను అమ్మనున్నాయి.