ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. 2024 ఫిబ్రవరిలో 35వేల ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడుపోయినట్లు సంస్థ ప్రకటించింది. గతేడాది కంటే అమ్మకాల్లో 100శాతం వృద్దిని సాధించినట్లు తెలిపింది. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ 42 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఓలా ఎలక్ట్రిక్ గత మూడు నెలల్లో దాదాపు 1 లక్ష రిజిస్ట్రేషన్లను నమోదు చేసుకంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో వరుసగా 30వేలకు పైగా యూనిట్లు నమోదు అయ్యాయి. డిసెంబర్ ఒక నెలలో 30వేల ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్లు నమోదు చేసిన మొదటి EV 2W తయారీ దారుగా నిలిచింది.
ఓలా ఇటీవల.. 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీ, లేదా 80వేల కిలోమీటర్లు లైఫ్ బ్యాటరీని ఆఫర్ ప్రకటించింది.S1 స్కూటర్ పోర్ట్ పోలియాతోపాటు కస్టమర్ల మరింత అవగాహన పొందడం, అందుబాటులో ఉండే ధరల వద్ద నాణ్యమైన EVలను అందించడమే ఈ వృద్దికి కారణమని ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్నారు. కస్టమర్ల సౌలభ్యం కోసం ఛార్జింగ్ పాయింట్లు, సర్వీస్ సెంటర్లతో పెంచుతున్నామన్నారు.
ఓలా తన పోర్ట్ పోలియాలో ఆరు ఎలక్ట్రిక్ స్కూటర్లను కలిగి ఉంది. S1 ప్రో, S1 X, S1ఎయిర్, S1X-2kWh, 3kWh, 4kWh ఉన్నాయి. ఓలా తన సర్వీస్ నెట్ వర్క్ ను ప్రస్తుతం 414 సర్వీస్ సెంటర్ల నుంచి అందిస్తోంది. ఏప్రిల్ 2024 నాటికా దేశవ్యాప్తంగా 600 సెంటర్లకు విస్తరించనుంది. ఇప్పుడు యాడ్ ఆన్ వారంటీని కూడా ఎంచుకోవచ్చు, ప్రయాణించే కిలోమీటర్ల గరిష్టపరిమితిని పెంచుకోవచ్చు.