లిథియం వేలంలో పాల్గొననున్న ఓలా!

లిథియం వేలంలో పాల్గొననున్న ఓలా!

న్యూఢిల్లీ: ప్రభుత్వం చేపడుతున్న క్రిటికల్ మినరల్స్‌ ఆక్షన్‌‌‌‌లో ఓలా ఎలక్ట్రిక్ పార్టిసిపేట్ చేయాలని చూస్తోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. లిథియం అయాన్ బ్లాక్‌‌‌‌లను వేలంలో దక్కించుకోవాలనే ప్లాన్‌‌‌‌లో ఉందని అన్నారు. లిథియం వంటి కీలక మినరల్స్‌‌‌‌ సప్లయ్‌‌‌‌ను పెంచేందుకు ప్రభుత్వం కిందటేడాది చివరి నుంచి  క్రిటికల్ మినరల్స్‌ ఆక్షన్ చేపడుతోంది.  ఎనిమిది రాష్ట్రాల్లోని 20 బ్లాక్‌‌‌‌లను వేలం వేస్తోంది.

దీని ద్వారా రూ.45 వేల కోట్లు సేకరించనుందని అంచనా. పెట్రోల్‌‌‌‌, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌‌‌ను ప్రభుత్వం  ప్రమోట్‌‌‌‌   చేస్తున్న విషయం తెలిసిందే. కిందటి ఆర్థిక సంవత్సరంలో అమ్ముడైన మొత్తం 39 లక్షల వెహికల్స్‌‌‌‌లో  ఈవీల వాటా 2 శాతం ఉంది.  ఈ నెంబర్ 2030 నాటికి 30 శాతానికి పెంచాలని టార్గెట్‌‌‌‌ పెట్టుకుంది.   ల్యాండ్ కొనుగోలు, బ్లాక్స్‌‌‌‌లో  లిథియం, ఇతర మినరల్స్ డిస్కవరీపై  ఓలా ఆసక్తి చూపించిందని, వివరాలు తెలుసుకుందని  సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.