ఓలా కుయ్యోమొర్రో : ఓలా కంపెనీలో 500 మంది ఉద్యోగులు ఔట్

ఓలా  ఎలక్ర్టిక్ వాహనాల తయారీ కంపెనీ ఉద్యోగులకు షాకిచ్చింది.  500 మంది ఉద్యోగులను తొలగించింది.  కంపెనీ  పునర్వ్యవస్థీకరణలో  భాగంగా  పలు డిపార్ట్ మెంట్ లలో పనిచేస్తున్న ఉద్యోగులును తొలగిస్తున్నట్లు  సంబంధిత వర్గాలు తెలిపాయి.  అయితే ఉద్యోగుల తొలగింపుపై ఓలా ఎలక్ట్రిక్  ఇంకా స్పందించలేదు.

 నివేదిక ప్రకారం  ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు లాభదాయకతను సాధించే ప్రయత్నాల్లో తన మార్జిన్లను మెరుగుపరచడానికి.. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని చూస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.  ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ జూలై నుంచి ప్రారంభమై నవంబర్ చివరి వరకు కొనసాగుతుందని తెలిపింది.

ఓలా  ఎలక్ట్రిక్ ప్రస్తుతం 4000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు.. సర్వీస్​ పనితీరు సరిగ్గా లేదనే ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో  లేటెస్ట్ గా  ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది. 

ALSO READ | ఒక్కసారిగా 2 వేల పాయింట్లు పెరిగిన స్టాక్ మార్కెట్.. ఎందుకిలా.. ఏం జరిగిందంటే..!

గత త్రైమాసికంలో (Q1 FY25) రూ.  347 కోట్ల నుండి జూలై- -సెప్టెంబర్ కాలంలో (Q2 FY25) నికర నష్టం  రూ. 495 కోట్లకు 43 శాతం పెరిగిందని కంపెనీ నివేదించింది . ఓలా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ కూడా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో  రూ.  1,644 కోట్ల నుంచి రూ.  1,214 కోట్లకు (త్రైమాసికంలో) 26.1 శాతం క్షీణించింది. నికర నష్టం మాత్రం ఏడాది ప్రాతిపదికన తగ్గింది.

అలాగే  ఇటీవల ఓలా ఎలక్ట్రిక్​పై 10 వేలకు  పైగా  కస్టమర్ల నుంచి  ఫిర్యాదులు వచ్చినట్లు గుర్తించిన  సీసీపీఏ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఓలా గతంలోనూ వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది.