
ఈవీ తయారీ సంస్థ ఓలా ఎస్1జెన్ పోర్ట్‌ఫోలియోలో ఎనిమిది ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. వీటి ధరలు రూ.80 వేల నుంచి రూ.1.70 లక్షల వరకు ఉంటాయి. బ్యాటరీల సామర్థ్యం 2 కిలో వాట్ అవర్ నుంచి 5 కిలోవాట్ అవర్ వరకు ఉంటుంది. ఈ మూడో జెనరేషన్స్కూటర్లలో డ్యూయల్ ఏబీఎస్, బ్రేక్ బై వైర్ టెక్నాలజీ, ఎనర్జీ రికవరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.