
భారత్ లో ఎలక్ట్రిక్ కార్లు, బైక్ లపై కస్టమర్లకు ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు తయారీకి మొగ్గుచూపు తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ (ఈ స్కూటర్) సెగ్మెంట్ లో ఓలా కంపెనీ దూసుకెళ్తోంది. ఈ కంపెనీ సేల్స్ అధికంగా ఉన్నాయి. ఈక్రమంలో ఓలా ఫెస్టివల్ ప్రమోషన్లలో భాగంగా ఎలక్ట్రిక్ స్కూటర్లపై కొత్త ఆఫర్లను ప్రకటించింది. ఓలా వివిధ మోడళ్లపై రూ. 20వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. Ola S1 ప్లస్ వేరియంట్ పై అతి తక్కువ ధర రూ. 89,999 కే విక్రయిస్తోంది. ఇతర వేరియంట్లపై కూడా డిస్కౌంట్ ఇస్తోంది.
ఓలా డిస్కౌంట్లతో పాటు S1 ప్రో, S1ఎయిర్ మోడళ్లపై రూ. 6,999 విలువైన కాంప్లిమెంటరీ ఎక్స్ టెండెట్ వారంటీని అందిస్తోంది. ఈ మోడళ్లను ఎంచుకునే కస్టమర్లు రూ. 3వేల వరకు ఎక్ఛేంజ్ బోనస్ పొందొచ్చు. సెలెక్టెడ్ బ్యాంకుల క్రెడిట్ కార్డ్ EMI లపై రూ. 5 వేల వరకు డిస్కౌంట్ ఉంది. ఫైనాన్సింగ్ ఆప్షన్ల ద్వారా కొనుగోలు చేయాలనుకుంటున్న కస్టమర్లకు ఓలా ఎలక్ట్రిక్ జీరో డౌన్ పేమేంట్, నో కాస్ట్ EMI, జీరో ప్రాసెసింగ్ ఫీజు, తక్కువ వడ్డీ రేట్లు అందిస్తోంది.
భారత్ లో ఓలా ఎలక్ట్రిక్ పోర్ట్ పోలియోలో మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి.
ఓలా S1X. దీని ధర రూ. 89,999 (ఎక్స్ షోరూమ్ )
ఓలా S1 ఎయిర్. దీని ధర రూ. 1లక్షా19వేల 828(ఎక్స్ షోరూమ్ )
ఓలా S1 ప్రో స్టాండర్డ్ - దీని ధర రూ. 1లక్షా 47వేల 499(ఎక్స్ షోరూమ్ )
ఓలా తన కస్టమర్ల కోసం సంక్రాంతి ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించింది. 2024 జనవరి 15 లోపు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.