ఓలా ఐపీఓకి స్పందన కరువు

ఓలా ఐపీఓకి స్పందన కరువు

న్యూఢిల్లీ : ఓలా ఐపీఓకి మొదటి రోజు స్పందన కరువయ్యింది. అమ్మకానికి పెట్టిన  46.51 కోట్ల షేర్లలో 35 శాతానికి అంటే   16.31 కోట్ల షేర్ల కోసం బిడ్స్ వచ్చాయి.  రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన పోర్షన్‌‌‌‌ 1.57 రెట్లు సబ్‌‌‌‌స్క్రయిబ్ అయ్యింది. నాన్ ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన షేర్లలో 20 శాతం సబ్‌‌‌‌స్క్రయిబ్ అయ్యాయి. క్వాలిఫైడ్ ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు.

ఓలా ఐపీఓ శుక్రవారం ఓపెన్ అయ్యింది. ఆగస్టు 6 న ముగుస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 6,145 కోట్లను సేకరించాలని  కంపెనీ చూస్తోంది. ఒక్కో షేరుని రూ.72–76 ప్రైస్‌‌‌‌ రేంజ్‌‌‌‌లో అమ్మకానికి పెట్టారు. ఐపీఓ పూర్తయితే ఓలా ఎలక్ట్రిక్ లో హ్యుండాయ్‌ మోటార్‌‌కు  2.95 శాతం వాటా దక్కుతుంది.