ఓలా బంగారం బండి!

ఓలా బంగారం బండి!

24 క్యారెట్స్ గోల్డ్​తో కొన్ని పార్టులకు పూతపూసి  సోనా పేరుతో ఎస్‌‌1 ప్రో లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్​ను ఓలా ఎలక్ట్రిక్ శనివారం లాంచ్ చేసింది. కంపెనీ చేపడుతున్న ‘సేవింగ్స్ వాలాస్కూటర్‌‌‌‌’ క్యాంపెయిన్‌‌లో భాగంగా దీనిని తీసుకొచ్చింది.

‘ఓలా సోనా కంటెస్ట్‌‌’ లో గెలిచిన వారికి ఈ లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్‌‌ స్కూటర్‌‌‌‌ను ఫ్రీగా ఇవ్వనుంది. దేశంలో తమ సేల్స్‌‌, సర్వీస్‌‌ నెట్‌‌వర్క్​ను ఈ నెల 25 న నాలుగు వేలకు పెంచుతామని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది.