రూ. 347 కోట్లకు చేరిన ఓలా నష్టం

రూ. 347 కోట్లకు చేరిన ఓలా నష్టం

ముంబై:  ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఏప్రిల్–-జూన్ క్వార్టర్​లో రూ. 347 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని నమోదు చేసింది.  ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, 2023 ఏప్రిల్-–జూన్ కాలంలో కంపెనీకి రూ. 267 కోట్ల నష్టం వచ్చింది.  తాజా క్వార్టర్​లో కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.1,644 కోట్లు కాగా, గత జూన్​ క్వార్టర్లో రూ.1,243 కోట్లు వచ్చాయి. ఖర్చులు రూ.1,461 కోట్ల నుంచి రూ.1,849 కోట్లకు పెరిగాయని బెంగళూరుకు చెందిన ఈ సంస్థ తెలిపింది.  ఈ నెల ప్రారంభంలో కంపెనీ మార్కెట్‌‌‌‌లో లిస్ట్​అయింది.  ఈ క్వార్టర్​లో కంపెనీ అత్యధికంగా 1,25,198 యూనిట్ల ఎలక్ట్రిక్​ స్కూటర్లను డెలివరీ చేసింది.