వృద్ధ జంట పెళ్లి... తరలి వచ్చిన జనం

ఓ వృద్ధ జంట పెళ్లి చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వస్త్రం తండాలో చోటుచేసుకుంది.   80 సంవత్సరాల  సమిడా నాయక్ తో  70 సంవత్సరాల లాలమ్మతో వివాహం జరిగింది.  70 సంవత్సరాల క్రితం వీరిద్దరూ గాంధర్వ వివాహం చేసుకోని నలుగురు కుమారులు, ఒక కూతురికి జన్మినిచ్చారు. దీంతో వీరి మనవళ్ళు, మనవరాలు తమ తాత, నాయినమ్మ పెళ్లి చేయాలన్న సంకల్పంతో వీరి మనుమడు  యాకూబ్ పుట్టినరోజు సందర్భంగా తండాలో అంగరంగ వైభవంగా  పెళ్లి నిర్వహించారు. వృద్ధ దంపతుల పెళ్లి చూడడానికి తండాలోని జనాలందరూ తరలివచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.