పొచ్చరలో దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్య

బజార్ హత్నూర్, (నేరడిగొండ) వెలుగు: పొచ్చర జలపాతంలో దూకి వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన ముక్క సుదర్శన్, ప్రమీల దంపతులు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీళ్లకు ఇద్దరు కొడుకులు. ఒకరు నేరడిగొండలో కాంట్రాక్టు లెక్చరర్‌‌‌‌గా పని చేస్తుండగా మరొకరు నిర్మల్‌‌‌‌లో వ్యాపారం చేసుకుంటూ వేర్వేరుగా ఉంటున్నారు. సుదర్శన్‌‌‌‌కు రెండేళ్ల కింద హార్ట్ సర్జరీ జరిగింది. వయసు పైబడటంతో కొంతకాలంగా ఆరోగ్యం సహకరించకపోవడం, దీనికితోడు కుటుంబంలో గొడవలు.. వెరసి దంపతులు మనస్తాపం చెందారు. బుధవారం పొద్దున నేరడిగొండ నుంచి పొచ్చర జలపాతం దగ్గరకు వచ్చారు. కుటుంబీకులకు ఫోన్‌‌‌‌ చేసి అందులో దూకారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. జాలర్ల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు.