
విశాఖపట్నంలో వైఎంసీఏ బీచ్ తీరానికి ఓ భారీ చెక్క పెట్టే కొట్టుకుని వచ్చింది. పర్యాటకులు, మత్సకారులు దీనిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పురాతమైన చెక్క పెట్టె కావడంతో ప్రొక్లెనర్ సహాయంతో ఒడ్డుకు చేర్చారు.
దీనిని చూసేందుకు బీచ్‌లో ఉన్న సందర్శకులు ఎగబడ్డారు. వారిని కట్టడి చేయడానికి పోలీసులు చాలానే శ్రమించాల్సి వచ్చింది. అయితేఈ పెట్టే బ్రిటిష్ కాలం నాటి పెట్టెగా పోలీసులు, అధికారులు అంచానా వేస్తున్నారు.
ఇంతకీ ఆ పెట్టెలో ఏముందనేది ఇప్పుడు అందరిలో ఉత్కంఠ రేపుతోంది. దీనిపై అర్కియాలజీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ పెట్టె బరువు సుమారుగా వంద టన్నుల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.