మరో 2 నెలలు పాత పాలక మండలే

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ ఎన్నికల్లో పాత పాలక మండలే మరో 2 నెలలు కొనసాగనుంది. ప్రస్తుతం గెలిచిన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇంకా రెండు నెలలు ఆగాల్సిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు పాలక మండలి గడువు ఉంది. గడువు ముగియకముందే రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఆ దిశగా నిర్ణయం తీసుకోవటం లేదు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవటంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు టైమ్ తీసుకునేందుకు ప్రభుత్వం ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్తగా కార్పొరేటర్లుగా ఎన్నికైనా వారు బల్దియాలో అడుగుపెట్టేందుకు వేచిచూడాల్సి వస్తోంది. పాలక మండలి గడువు ముగిసే వరకు ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లకే అన్ని అధికారాలు ఉంటాయని ఆఫీసర్లు చెబుతున్నారు. గడువు వరకు యధావిధిగా అన్ని సమావేశాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. స్టాండింగ్​ కమిటీ సమావేశాలతో పాటు బడ్జెట్​ సమావేశాలు కూడా నిర్వహించే అధికారం ఉంటుందన్నారు.

For More News..

రీ ఓపెన్ అయిన థియేటర్స్.. క్యూ కడుతున్న సినీలవర్స్

టీ20 సిరీస్‌పై ఇండియా కన్ను.. ఆసీస్‌తో నేడు రెండో వన్డే