ఓల్డ్ జైల్ ఖానా ప్రహరీ కూలి ఆరు షాపులు ధ్వంసం

  • భవనాన్ని నేలమట్టం చేసిన జీహెచ్ఎంసీ

సికింద్రాబాద్, వెలుగు: వరుస వానలకు పూర్తిగా నానిన మోండా మార్కెట్ ఓల్డ్ జైల్ ఖానా ప్రహరీ గోడ మంగళవారం కూలింది. ఈ ప్రమాదంలో ఐదు టైలరింగ్​షాపులు, ఒక పూల షాపు ధ్వంసమయ్యాయి. ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని షాపులను ఖాళీ చేయించారు.

భవనాన్ని నేలమట్టం చేశారు. ఘటనా స్థలాన్ని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​ యాదవ్​పరిశీలించి, బాధితులతో మాట్లాడారు.