కూసుమంచి, వెలుగు: ‘స్థలం ఉంటే ఇల్లు కట్టుకునేవారికి రూ.3లక్షలు ఇస్తామని సర్కార్చెప్పిందని, నా స్థలంలో చిన్న రేకుల షెడ్ వేసుకున్న సారూ. రూ.3లక్షల స్కీమ్ ఇప్పించుండ్రీ’.. అంటూ బొంకూరి సైదులు అనే వృద్ధుడు కలెక్టర్ పీవీ గౌతమ్‌ను సోమవారం వేడుకున్నాడు. స్కీం రాగానే ఇప్పిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. మండలంలోని నాయకన్‌గూడెం వచ్చిన కలెక్టర్ కు ఉపాధిహామీ కూలీలు తమకు వారానికి కేవలం రూ.200లే పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కలెక్టర్ కూలీలతో మాట్లాడుతూ రోజుకు నాలుగైదు గంటలు పని చేయాలని సూచించారు. గ్రామ సర్పంచ్కాసాని సైదులు10 ఎకరాలమెగా పార్కులో మొక్కలు నాటామని, మేకలు, పశువులు మేస్తున్నాయని పార్కు చుట్టూ ఫెన్సింగ్వేయించాలని కలెక్టర్ ను కోరారు. అనంతరం కలెక్టర్సంపద వనంలో మొక్క నాటి నీరు పోశారు. ఆయన వెంట డీఆర్డీఏ పీడీ విద్యాచందన, ఎంపీడీవో కరుణాకర్‌రెడ్డి, ఏపీవో అప్పారావు
తదితరులు ఉన్నారు.