బషీర్ బాగ్, వెలుగు: నకిలీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ యాప్ పెట్టుబడులు పెట్టించి 64 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల మేరకు బాధిత వృద్ధుడి ని సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్ టిప్స్ పేరుతో వివిధ సామాజిక మాధ్యమాలలో ప్రకటనల ద్వారా వాట్సాప్ బిజినెస్ గ్రూప్లో 'ఏ11 ప్రోడర్స్ సర్వీస్ క్లస్టర్' అనే లింక్ వచ్చింది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు సంబంధించి లాభాలు వస్తాయని సందే శాలను అందులో వచ్చాయి.
వారు చెప్పిన విధంగా ఎస్సీఐఈ' అనేయాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. బాధితుడు తన ఖాతా నుంచి రూ. 16,99,000 వారు యాప్ ద్వారా బదిలీ చేశాడు. ఆ యాప్లో బాధితుడి ద్యాష్ బోర్డులో పెట్టుబడి లాభాలు చూపించారు. కానీ ఆ మబ్బును విత్అ చేసుకోవాలంటే మరింత పెట్టుబడి పెట్టాలని చెప్పారు. బాధితుడు మోసపోయాయని సైజర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.