గొల్లపల్లి, వెలుగు : ముగ్గురు బాలికలపై ఓ వృద్ధుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం తిర్మలాపూర్కు చెందిన శివరాత్రి ముత్తయ్య (65) 10, 9, 8 ఏండ్ల వయస్సున్న ముగ్గురు బాలికలను మూడు నెలలుగా బెదిరిస్తూ తన ఇంట్లోని పెరటి దగ్గర అత్యాచారం చేస్తున్నాడు.
విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఓ బాలికకు రక్తస్రావం కావడంతో గురువారం విషయం వెలుగులోకి వచ్చింది. బాలికల కుటుంబసభ్యులు గొల్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.