మునుగోడు నియోజకవర్గంలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చౌటుప్పల్ పోలింగ్ స్టేషన్ ఓ సంఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధుడిని ఓటు వేయించడానికి స్థానిక లీడర్ ఆటోలో తీసుకొని వచ్చాడు. అయితే ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మాత్రం ఆ వృద్ధుడిని వదిలేసి ఆ లీడర్ పట్టించుకోకుండా అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఓటు వేసిన తర్వాత గంట సేపటి నుండి పోలింగ్ స్టేషన్ దగ్గర ఆటో కోసం వెయిట్ చేస్తున్నట్టు ఆ వృద్ధుడు వెల్లడించాడు.
ఓటు వేసిన తర్వాత తమ అవసరం తీరిపోయింది కాబట్టి తనను పట్టించుకోవట్లేదని ఆ వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు నడవడం కూడా సరిగా రాదన్న అతను... ఎవరూ రాకపోవడంతో పాకుకుంటూ వెళ్లాడు. ఇక మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు.