మ్యుటేషన్లు కాకపోవడంతో మళ్లీ అమ్మేందుకు ప్రయత్నాలు
ఒక్కొక్కటిగా బయటపడుతున్న లోపాలు
ఆందోళనలో కొనుగోలుదారులు
ఖమ్మం రూరల్ తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్ రిజిస్ర్టార్ ఆఫీసులో ఓ వ్యక్తి స్లాట్‌బుక్ చేసుకుని మంగళవారం రిజిస్ట్రేషన్‌కు వచ్చాడు. అతని అమ్మమ్మ పేరుమీద ఉన్న 0.11కుంటల అగ్రికల్చర్ ల్యాండ్‌ను గతంలో ఒకరికి విక్రయించారు. కొనుగోలు చేసినవాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నా, మ్యుటేషన్ కాలేదు. కొత్తగా వచ్చిన ధరణిలో వృద్ధురాలి పేరే ఉండడంతో దీనిని ఆసరాగా చేసుకున్న అతగాడు కొందరిని వెంటబెట్టుకొని తహసీల్దార్ ఆఫీస్‌కు వచ్చాడు. మరో పదినిమిషాల్లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తవుతాయనగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి కొన్నవారికి సమాచారం ఇచ్చాడు. వాళ్లు వెంటనే అలర్ట్ అయి తహసీల్దార్‌కు ఫోన్లో కంప్లైట్ చేయడంతో మ్యుటేషన్ నిలిపివేశారు.
ఖమ్మం రూరల్, వెలుగు: స్టేట్‌వైడ్ గా సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన ధరణి పోర్టల్‌లో లోపాలు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. ధరణి రాక ముందు అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుగోలు చేసినవాళ్లలో చాలామంది రిజిస్ట్రేషన్చేయించుకున్నప్పటికీ మ్యుటేషన్కాలేదు. ఇలాంటి అప్లికేషన్లు తహసీల్దార్ఆఫీసుల్లో వేలల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ధరణిని అప్డేట్చేసే క్రమంలో ఇలాంటి మ్యుటేషన్లన్నింటినీ ముందే పూర్తి చేసి కొన్నవాళ్ల పేర్లు ఎక్కించాల్సిన ఆఫీసర్లు ఆ పని చేయలేదు. దీంతో ధరణి పోర్టల్‌లో పాత వాళ్ల పేర్లే వస్తుండడంతో కొనుగోలుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం పలుచోట్ల ఇలాంటి సమస్యలు బయటపడగా, వాటిపై ఆఫీసర్లకు క్లారిటీ లేకుండా పోయింది.
వేల మ్యుటేషన్లు పెండింగ్‌లో..
పాత రెవెన్యూ చట్టం ప్రకారం అగ్రికల్చర్ ల్యాండ్‌ను మొదట సబ్రిజిస్ట్రార్ఆఫీసులో రిజిస్ర్టేషన్ చేసుకొని, కొనుగోలుదారుని పేరు మీద మ్యుటేషన్ చేసుకునేందుకు మీ సేవలో అప్లై చేసుకునేవారు. తర్వాత వీఆర్వో, ఆర్ఐ ఫీల్డ్ లెవల్లో పరిశీలించి రిపోర్ట్ ఇస్తే వాటి ఆధారంగా తహసీల్దార్ మ్యుటేషన్ చేసేవారు. రిజిస్ట్రేషన్ గంటల వ్యవధిలో పూర్తయితే మ్యుటేషన్‌కు నెలలు పట్టేది. దీంతో ధరణి పోర్టల్‌కు ముందు మ్యుటేషన్ కోసం అప్లై చేసుకున్న వేలాది మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈ క్రమంలో గత నెలలో తెలంగాణ ప్రభుత్వం స్టేట్వైడ్అగ్రికల్చర్, నాన్అగ్రికల్చర్భూముల రిజిస్ర్టేషన్లను, రెవెన్యూలో ఉన్న ఆన్లైన్సేవలను నిలిపివేసింది. కాగా, ధరణిలో అప్లోడ్ చేసేముందే ఇలాంటి పెండింగ్మ్యుటేషన్లను క్లియర్‌చేసి, కొనుగోలు చేసినవారి పేర్లను ఎక్కించాల్సిన రెవెన్యూ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ప్రస్తుతం ఆన్లైన్లో పాతవాళ్ల పేర్లే వస్తున్నాయి. ధరణికి ముందు భూములు అమ్మినవారి పేర్లే ప్రస్తుతం పోర్టల్‌లో ఉండడం, తహసీల్దార్ ఆఫీసుల్లో ఆ భూములను పదిహేను నిమిషాల్లో ఇతరుల పేర్లపైకి మ్యుటేషన్ చేసే అవకాశం ఉండడంతో భయపడుతున్నారు. కాగా, దీనిపై తహసీల్దార్లకు కూడా క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పుడిప్పుడే ఇలాంటి కేసులు వస్తుండడంతో పై ఆఫీసర్లకు రిపోర్ట్ చేస్తున్నారు. త్వరలోనే దీనికో పరిష్కారం లభిస్తుందని చెబుతున్నా కొనుగోలుదారులు మాత్రం తలపట్టుకుంటున్నారు.
నా రిజిస్ర్టేషన్ డాక్యుమెంట్ పనికిరాదట
నేను 8 నెలల క్రితం ఎకరం వ్యవసాయ భూమి కొనుగోలుచేసి రిజిస్ర్టేషన్ చేసుకున్న. మ్యుటేషన్‌కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసినా రెవెన్యూ ఆఫీసర్లు ఇంతవరకు పాస్‌బుక్ ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన ధరణిలో నా పేరు కాకుండా పాతవాళ్ల పేరే ఉంది. నా దగ్గర ఉన్న డాక్యుమెంట్ పనికిరాదని కొంతమంది అంటున్నారు. నాకు భయంగా ఉంది. ఆఫీసర్లు వెంటనే నాకు పాస్బుక్ఇప్పించాలె.
– గుత్తికొండ సీతారాములు, కొనుగోలుదారుడు
పై ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినం
గతంలో రిజిస్ర్టేషన్ చేసుకొని పాస్‌బుక్‌లు పొందని రైతులు చాలామంది ఉన్నారు. కానీ ధరణిలో పాత పట్టాదారుల పేర్లు మాత్రమే ఉన్నాయి. దీనిపై కొనుగోలుదారుల్లో ఆందోళన కనిపిస్తోంది. ధరణిలో క్రయ, విక్రయాలు జరుగుతున్నందున కొనుగోలుదారులు అలర్ట్‌గా ఉండాలి. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ ప్రకారం ముందుకెళ్తాం.
– శ్రీనివాసరావు, ఖమ్మం రూరల్ తహసీల్దార్, జాయింట్ సబ్‌రిజిస్ర్టార్
For More News..