
- ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: డీఎస్సీ 2003 టీచర్లకు పాత పింఛన్ విధానాన్ని అమలు చేయిస్తామని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. ఇప్పటికే ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందించామని గుర్తుచేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పీఆర్టీయూ భవన్‌లో జరిగిన డీఎస్సీ 2003 టీచర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 57/4, 57/5 మెమోల ఆధారంగా డీఎస్సీ 2003 టీచర్లకు పాత పింఛన్ వస్తుందని చెప్పారు. కేంద్ర ఉద్యోగులకు నోటిఫికేషన్‌లో పాత పింఛన్ ఇచ్చి.. కొత్త పింఛన్ ద్వారా నియామకమైన ఉద్యోగులందరికీ పాత పింఛన్ విధానం వర్తింపజేసిందని తెలిపారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు.