వస్తువులు పాతవైతే అవి మనం పక్కన పెట్టేస్తాం.. వాటి స్థానంలో కొత్తవి కొంటాం. కానీ ఓ ప్రబుద్దుడు చిన్నగిన్నెకు పెట్టిన రేటు చూస్తే .. కిరాక్ అనిపిస్తుంది. అతను పిచ్చోడా? లేక నిజంగానే దానికి అంత విలువ వుంటుందా అని మనకు ప్రశ్న ఎదురవుతుంది. మన పెద్దలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని సింపుల్‌గా చెప్పారు. నేడు రాను.. రాను.. పాత వస్తువులకు గిరాకీ పెరుగుతుందని అంటే నేను ఏదో అనుకున్నాం.. కానీ ఇంత పెద్దఎత్తున ఊహించలేదు. ఎవరైనా వాడేసిన వస్తువులను వందలాది కోట్ల రూపాయిలకు కొంటారా? కొనరు. అది జరిగే ప్రశక్తే లేదు అంటారా? కానీ, ఒక మహానుభావుడు దానిని కొన్నాడు. అది నచ్చిందో లేదో తెలియదు కానీ .. రూ. 248 కోట్లు పెట్టి కొనేశాడు. ఆతర్వాత అతనే ఆశ్చర్యపోయాడు. అలాంటి ఘటన ఒకటి చైనాలో చోటుచేసుకుంది.
వెయ్యి సంవత్సరాల నాటి ఈ అరుదైన చిన్న పాత్ర ( బౌల్) రూ.248 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ వేలంపాట హాంగ్‌కాంగ్‌లో రికార్డు సృష్టించింది.చేతిలో ఇమిడిపోయే ఈ పాత్ర చైనాలోని సాంగ్ రాజవంశానికి చెందింది. ఎంతో ఉత్కంఠ భరితంగా వేలంపాట దాదాపు 20నిమిషాలు కొనగింది. అయితే ఈ వేలంపాటలో ప్రత్యక్షంగా ఒక్కరే పాల్గొనగా.. మిగతా వారు ఆన్ లైన్ లో పాల్గొన్నారని వేలంపాట నిర్వహించిన సంస్థ సదబీ తెలిపింది.
ఇక ఈ చిన్న పాత్ర విషయానికి వస్తే ... 13 సెంటీ మీటర్ల చుట్టుకొలత.. లేత నీలం ఆకుపచ్చ రంగుతో మెరుగు పెట్టారు. ఈ పాత్రను రాజుల కాలంలో బ్రష్ లు కడగడానికి ఉపయోగించేవారని తెలుస్తోంది. రూ. 67 కోట్లతో ప్రారంభమైన వేలంపాట రూ. 248 కోట్లకు అమ్ముడైంది.2014లో మింగ్ రాజవంశానికి చెందిన వైన్ పాత్రను, లియు అనే వ్యక్తికి రూ. 235 కోట్లకు అమ్మారు. ఈ రికార్డును ఇప్పుడు రూ. 248 కోట్లతో ఈ రూ-వేర్ పాత్ర అధిగమించింది. వైన్ పాత్రను కొనుగోలు చేసిన లియు చైనాలో ఓ సంపన్నుడు. కళాఖండాలను సేకరించడం అతడి హాబీ. ఈయన గతంలో టాక్సీ డ్రైవర్‌గా పనిచేసేవాడు.
ఈ పాత్రను ఓ అరుదైన అద్భుతమని ఆక్షన్ హౌస్‌లోని చైనీస్ ఆర్ట్ అధికారి చెప్పారు. ఈ పాత్ర ఇంత ధర పలుకుతుందని అనుకోలేదు. అయితే, గట్టి పోటీ మాత్రం ఉంటుందని భావించాం. రు-వేర్ (పాత) వస్తువులను ఎప్పుడు వేలం వేసినా ఉత్కంఠగానే ఉంటుంది. ఎందుకంటే, చైనా చరిత్రలో రు-వేర్ వస్తువులకు ఉన్న ప్రాధాన్యత మరే ఇతర వస్తువులకూ ఉండదని ఆయన అన్నారు.అయితే, ఈ పాత్రలకు నకలుగా చాలా పాత్రలు ఉన్నాయని ఆయన అన్నారు. ఇలాంటి పాత్రలు తమవద్ద ఉన్నాయంటూ నిత్యం ఎంతో మంది తనకు ఇ-మెయిల్స్ పంపిస్తుంటారని, కానీ, సాంగ్ రాజవంశానికి చెందిన పాత్రలు నాలుగు మాత్రమే ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్నాయని వివరించారు.