కేజీబీవీల్లో పాత టీచర్లనే కొనసాగించాలి.. ప్రశ్నించిన ఆర్.కృష్ణయ్య

కేజీబీవీల్లో పాత టీచర్లనే కొనసాగించాలి.. ప్రశ్నించిన ఆర్.కృష్ణయ్య

బషీర్ బాగ్, -వెలుగు: కస్తూర్భా గాంధీ విద్యాలయాల(కేజీబీవీ) టీచర్లకు జీతాలు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంటే.. వారిపై రాష్ట్ర సర్కారు పెత్తనం ఏంటని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్నవారితో రెండేళ్లుగా పనిచేయించుకొని ఇప్పుడు వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవడం సరికాదన్నారు. విధుల్లో నుంచి తొలగించిన తమను రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ ఆధ్వర్యంలో లక్డీకపూల్​లోని స్కూల్​ ఎడ్యుకేషన్ కమిషనరేట్ ముందు కేజీబీవీ టీచర్లు ఆందోళన చేపట్టగా.. వారికి ఆర్.కృష్ణయ్య మద్దతు తెలిపారు.

ALSO READ:ఆదేశించినా.. డెక్కన్ కిచెన్​ను ఎలా కూల్చారు?.. జీహెచ్‌‌‌‌ఎంసీ అధికారులపై హైకోర్టు ఫైర్

ఆయన మాట్లాడుతూ.. కేజీబీవీల్లో  రెండేండ్లు పనిచేసి అనుభవం ఉన్నవారిని తొలిగించి కొత్తవారిని తీసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఉద్యోగాలను అమ్ముకునేందుకే ఇలా చేశారని ఆరోపించారు. ఈ నోటిఫికేషన్ రద్దు చేసి, పాత వారినే కొనసాగించాలని.. లేకపోతే స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్​కు తాళాలు వేస్తామని ఆయన హెచ్చరించారు.