ఓ మారుమూల గ్రామంలో సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఓ వృద్ధ పెద్దమనిషి చూడడానికి ఓ సింపుల్ మ్యాన్న్ లా అనిపించినా.. అతని గురించి తెలిసిన వాళ్లు మాత్రం వావ్ అనకుండా ఆశ్చర్యపోకుండా ఉండలేకపోతున్నారు. అతను రూ. 100 కోట్ల విలువైన షేర్లను కలిగి ఉన్నాడు. అవును, మీరు సరిగ్గానే చదివారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా పోర్టల్స్ లో వైరల్ అవుతోంది. ఓ వీడియోలో ఆయన ప్రాంతీయ దుస్తులు ధరించి, కెమెరా వెనుక ఉన్న వారితో తన మాతృభాషలో సంభాషణలో నిమగ్నమై ఉన్నాడు. ఈ సమయంలోనే అతను తాను కలిగి ఉన్న షేర్ల పేర్లను, సంబంధిత పెట్టుబడి మొత్తాలను వెల్లడించాడు.
'X' యూజర్ రాజీవ్ మెహతా అనే పేజీలో పోస్ట్ అయిన ఈ వీడియోకు“అతను రూ. 80 కోట్ల ఎల్ అండ్ టి…రూ.21 కోట్ల విలువైన అల్ట్రాటెక్ సిమెంట్, రూ.1కోటి విలువైన కర్ణాటక బ్యాంక్ షేర్లను కలిగి ఉన్నాడు. అయినప్పటికీ ఆయన సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. అని క్యాప్షన్ లో జోడించారు. దీనికి అదనంగా, ఆ వ్యక్తి తాను సుమారుగా ప్రతి సంవత్సరం రూ. 6 లక్షల డివిడెండ్‌లు కలిగి ఉన్నాడనేది ఇంటర్నెట్ యూజర్స్ ను మరింత ఆశ్చర్యపరిచింది, ఎందుకంటే వారు అతని పెట్టుబడుల నుంచి అతను పొందవలసిన డివిడెండ్‌లను లెక్కించడం ప్రారంభించారు.
ఈ సాధారణ మనిషి గురించి అసాధారణమైన విషయాలు తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యపోతూ.. తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. పోర్ట్‌ఫోలియోలో మంచి స్టాక్‌లు ఉన్నాయని చూడటం ఆనందంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.
As they say, in Investing you have to be lucky once
— Rajiv Mehta (@rajivmehta19) September 26, 2023
He is holding shares worth
₹80 crores L&T
₹21 crores worth of Ultrtech cement shares
₹1 crore worth of Karnataka bank shares.
Still leading a simple life#Investing
@connectgurmeet pic.twitter.com/AxP6OsM4Hq