తొర్రూరు, వెలుగు: ఆస్పత్రికని బయలుదేరిన ఓ వృద్ధురాలు ఆర్టీసీ బస్సులోనే కన్నుమూసింది. మహబూబాబాద్జిల్లాలోని తొర్రూరులో గురువారం ఈ ఘటన జరిగింది. పేర్కేడుకు చెందిన మావిండ్ల గౌరమ్మ (70) అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. తొర్రూరు ఆస్పత్రిలో చూపించుకుందామని, స్వగ్రామం నుంచి రాయపర్తి వరకు ఆటోలో వచ్చి అక్కడి నుంచి ఆర్టీసీ బస్సు ఎక్కింది.
మార్గమధ్యలో గౌరమ్మలో ఉలుకుపలుకు లేకపోవడంతో తోటి ప్రయాణికులు 108కు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.