కాశీబుగ్గ, వెలుగు : గ్రేటర్ వరంగల్ సిటీలోని సుందరయ్య నగర్‌కు చెందిన సౌందర్య (80) అనే వృద్ధురాలిని కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటికి గెంటేశారు. ఆరు నెలలుగా తనను చిత్రహింసలు పెడుతూ బాత్ రూంలో పడుకోబెట్టారని వృద్ధురాలు తెలిపింది. తనకు ఐదుగురు సంతానం అని, ఎవరి దగ్గరికి పోయినా తనను చూసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
ఎవరైనా తనను ఆదుకోవాలని కాశీబుగ్గ అంబేద్కర్ జంక్షన్ వద్ద బైఠాయించింది. దీంతో స్థానికులు ఇంతేజార్గంజ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెతో మాట్లాడారు. న్యాయం చేస్తామని చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది.