దేశ వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు ఎక్కడున్నా సరే వెళ్లి రాఖీ కడుతున్నారు సోదరీమణులు. తమ మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తున్నారు. లేటెస్ట్ గా ఓ 80 ఏళ్ల వృద్ధురాలు తన తమ్ముడిపై ప్రేమతో 8 కి.మీ నడుచుకుంటూ వెళ్లి రాఖీ కట్టింది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొత్తపల్లికి చెందిన బక్కవ్వ కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కొండయ్య పల్లిలో ఉంటున్న తన తమ్మునికి రాఖీ కట్టేందుకు 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లింది. ఈ రెండు గ్రామాల మధ్య రోడ్డు సౌకర్యం లేకపోవడంతో 8 కి. మీ. మేర నడిచి వెళ్లింది. కాలినడకన వెళ్తున్న వృద్ధురాలని ఓ యువకుడు ఆపి వివరాలు కనుక్కొని ఎక్కడికి వెళ్తున్నావ్ అని ప్రశ్నించగా తన తమ్ముడికి కాఖీ కట్టేందుకు వెళ్తున్నానని బదలిచ్చింది. ఈ వీడియో వైరల్ అవుతోంది