నీటి బకెట్ లో పడి వృద్ధురాలు మృతి

నీటి బకెట్ లో పడి వృద్ధురాలు మృతి
  • రంగారెడ్డి జిల్లా చీపునుంతలలో ఘటన

ఆమనగల్లు, వెలుగు: ప్రమాదవశాత్తు నీటి బకెట్ లో పడి ఊపిరాడక వృద్ధురాలు చనిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది.  తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామానికి చెందిన గుమ్మడి వెంకటమ్మ(72)  కొడుకు హైదరాబాద్​లో నివసిస్తుండగా.. ఆమె ఒక్కతే ఇంట్లో ఉంటుంది. శనివారం రాత్రి బాత్ రూమ్ కు వెళ్లిన ఆమె నీటి బకెట్ లో పడి ఊపిరాడక చనిపోయింది. ఆదివారం ఉదయం ఇంటికి పాలు పోసేందుకు వచ్చిన వ్యక్తి చూడగా,  అప్పటికే ఆమె చనిపోయిందని గ్రామస్తులు తెలిపారు.