హయత్నగర్లో దొంగల ముఠా రెచ్చిపోయింది. తొర్రూరులో ఓ వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకున్న దొంగలు.. చివరికి ఆమెను హత్య చేశారు. తొర్రూర్‌లో నివాసముంటున్న సత్తమ్మ తన కుటుంబ సభ్యులుతో 2023 జూన్ 4 ఆదివారం రోజున ఓ ఫంక్షన్ కు వెళ్లింది. అయితే ఫంక్షన్ అయిపోయాక రాత్రి సత్తమ్మ ఒక్కతే ఇంటికి తిరిగివచ్చింది. తెల్లవారుజామున చూస్తే విగతజీవిగా కనిపించింది. దీంతో పక్కింటివారు షాక్ అయ్యారు.
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. సత్తమ్మను బంగారం కోసమే దుండగులు చంపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సత్తమ్మ నిద్రిస్తున్న సమయంలో దొంగల ముఠా ఇంట్లోకి చొరబడి.. ఆమె ఒంటిపై ఉన్న 10 తులాల బంగారంతో పాటు ఇంట్లో ఉన్న వెండి ఆభరణాలను కూడా ఎత్తుకెళ్లినట్లుగా తెలుస్తోంది. గతంలో హయత్‌నగర్‌లో జరిగిన దొంగతనాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.