వికారాబాద్ లో ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం.. నొప్పికి ఇంజక్షన్ ఇస్తే కాలు చచ్చుబడింది..

వికారాబాద్ జిల్లాలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం బట్టబయలైంది.. మోకాలి నొప్పితో వెళ్లిన ఓ వృద్ధురాలికి ఆర్ఎంపీ డాక్టర్ ఇంజక్షన్ ఇవ్వగా ఆమె కాలు పూర్తిగా చచ్చుబడింది. జిల్లాలోని తాండూరులో చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. యాలాల మండలం దౌలాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీబాయి అనే వృద్ధురాలు మోకాలి నొప్పి  తీవ్రం అవ్వటంతో తాండూరులోని ఆర్ఎంపీ డాక్టర్ ముకిత్ ను ఆశ్రయించింది.

వృద్ధురాలి మోకాలి నొప్పికి కారణం ఏంటో.. పరీక్షించకుండా.. అవగాహన లేకుండానే నొప్పికి ఇంజక్షన్ ఇచ్చాడు సదరు ఆర్ఎంపీ డాక్టర్. దీంతో ఆమె కాలు పూర్తిగా చచ్చుబడి పోయింది. నొప్పి తగ్గిస్తాడని ఆశ్రయిస్తే.. ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ తో కాలు చచ్చుబడిపోయిన వృద్ధురాలు దిక్కుతోచని స్థితిలో జిల్లా వైద్యాధికారులను సంప్రదించింది.

ALSO READ : హైదరాబాదీలు బీ అలర్ట్: 10వేల నకిలీ ఆధార్ అకార్డులు 15వేల నకిలీ ఓటర్ కార్డులు

తన కాలు చచ్చుబడటానికి కారణమైన ఆర్ఎంపీ డాక్టర్ మీద చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ కు, వైద్యాధికారులకు ఫిర్యాదు చేసింది వృద్ధురాలు. వృద్ధురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ జరిపిన అధికారులు ఆసుపత్రిని సీజ్ చేశారు.