![నిర్మల్ జిల్లా ముథోల్ లో ఔరంగజేబు కాలం నాటి నాణాలు](https://static.v6velugu.com/uploads/2025/02/oldest-coins-found-in-muthol-nirmal-district_J3Kpi9MPoI.jpg)
నిర్మల్ జిల్లాలో అతిపురాతన నాణాలు దొరికాయి. ముధోల్ లోని మారుతి అనే వ్యక్తి నూతన ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వుతున్నారు. పునాదులు తవ్వుతుండగా గడ్డపారకు ఒక మట్టి కుండ తగిలి.. అందులోంచి పురాతన నాణాలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని ఇంటి యజమాని ముధోల్ ఎస్సై సంజీవ్ కు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సంజీవ్ తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్ నారాయణ పంచనామా నిర్వహించి 92 నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఔరంగజేబు కాలం నాటివని గుర్తించారు. ఈ నాణాలను ముధోల్ ట్రెజరీ ( ఉపకోశాధికారి) కార్యాలయంలో డిపాజిట్ చేస్తున్నట్లు తహశీల్దార్ తెలిపారు.