83 ఏళ్ల వయస్సులో వికెట్ కీపింగ్ అదుర్స్

83 ఏళ్ల వయస్సులో వికెట్ కీపింగ్ అదుర్స్

ప్రస్తుత రోజుల్లో సెలవచ్చిందంటే చాలు.. పిల్లల దగ్గర నుంచి బ్యాట్ బాల్ పట్టుకొని  క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్ కు వెళతారు. అది పల్లె అయినా.. పట్టణమైనా సరే.. ఒక వేళ దగ్గరలో గ్రౌండ్ లేకపోతే రోడ్డుపైనే  క్రికెట్ ఆడతారు.  అయితే  ఒక్కసారి క్రికెట్ ఆడితే దాంతో విడదీయరాని  అనుబంధం  ఏర్పడుతుంది. అదే ఇప్పుడు 83 ఏళ్ల వయస్సులో కూడా ఓ వృద్దుడు క్రికెట్ గ్రౌండ్ లో వికెట్ కీపింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.  పైగా ఆయన ఆరోగ్యంగా ఉన్నాడా అంటే .. వీపుకు ఆక్సిజన్ సిలెండర్ తగిలించుకొని క్రికెట్ ఆడాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Cricketgraph (@cricketgraph)

ఎంత క్రికెట్ ఆటకు వయస్సుకు సంబంధం లేదని  ఒక సీనియర్ ఆటగాడు నిరూపించాడు. సహచర ప్లేయర్లతో కలసి ఆటను ఆస్వాదించొచ్చని చూపించాడు. స్కాట్లాండ్​కు చెందిన మాజీ ఆటగాడు అలెక్స్ స్టీల్ 83 ఏళ్ల వయసులో తనకు గేమ్​పై ఉన్న మక్కువను చాటుకున్నారు. ఒకవైపు అనారోగ్యం తీవ్రంగా బాధిస్తున్నా.. క్రికెట్ ఫీల్డ్​లోకి దిగి అదరగొట్టారు. ఒక స్థానిక క్లబ్​తో జరిగిన మ్యాచ్​లో తన శరీర వెనుక భాగంలో ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని మరీ ఆయన వికెట్ కీపింగ్ చేశారు.

అలెక్స్ స్టీల్ వికెట్ కీపింగ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఇది చూసిన నెటిజన్స్.. ఆటపై ఆయనకు ఉన్న అంకితభావం చూసి ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. కాగా, 2020లో ఇండియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అనే ఊపిరితత్తులకు సంబంధించిన వ్యాధి బారిన పడ్డారు అలెక్స్. అప్పటి నుంచి ఆయన ఆక్సిజన్​ సపోర్ట్​తోనే తన లైఫ్​ను ముందుకు సాగిస్తున్నారు.