100 ఏళ్ల వీరాస్వామి రెస్టారెంట్.. మూసివేతకు దగ్గరలో.. మహారాణులు, ప్రధానులకు ఇష్టమైన హోటల్ ఇది..!

100 ఏళ్ల వీరాస్వామి రెస్టారెంట్.. మూసివేతకు దగ్గరలో.. మహారాణులు, ప్రధానులకు ఇష్టమైన హోటల్ ఇది..!

ఇండియాను బ్రిటిష్ పాలిస్తున్న రోజుల్లో ఏర్పాటు చేసిన రెస్టారెంట్.. అదికూడా క్వీన్ ఎలిజబెత్ 2 పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించిన హోటెల్.. బ్రిటిష్ మహారాణులు, యువరాజులు, మర్చంట్స్, ధనికులు ఇలా అందరికీ ఇష్టమైన రెస్టారెంట్ మూసివేతకు దగ్గరపడింది. వందేళ్ల లెగసీ సంపాదించిన వీరస్వామి రెస్టారెంట్ క్లోజ్ అవుతందనే వార్త ఇప్పుడు లండన్ లో చర్చనీయాంశంగా మారింది. తమకిష్టమైన హోటెల్ మూసివేసే పరిస్థితులు ఉన్నాయని తెలిసి రాజవంశీయులతో పాటు ఆ హోటల్ తో అనుబంధం ఉన్న ధనికులు, ఇండియన్స్ కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. 

వీరస్వామి రెస్టారెంట్ బ్రిటిష్ రాణి ఎలిజబెత్ 2 పుట్టిన రోజున ఏప్రిల్ 1926 లో అట్టహాసంగా ప్రారంభమైంది. మర్లాన్ బ్రాండో, నుంచి క్వీన్ ఎలిజబెత్ వరకు ఎందరికో ఆతిథ్యం ఇచ్చింది ఈ రెస్టారెంట్. కానీ ఇప్పుడు ఈ రెస్టారెంట్ కు క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ ప్రాపర్టీకి ఓనర్ అయిన క్రౌన్ ఎస్టేట్స్ (The Crown Estate) ఈ రెస్టారెంట్ ప్లేస్ ను వాపస్ తీసుకోవాలని భావిస్తోందట. దీనికి సంబంధించి లీజును ఇక పొడించడం కుదరదని తేల్చి చెప్పింది ఆ సంస్థ. లండన్ లోని పికాడిల్లీ సర్కస్ కు దగ్గరలో విక్టరీ హౌజ్ అనే బిల్డింగ్ లో వీరస్వామి రెస్టారెంట్ ఉంటుంది.  ఈ బిల్డింగ్ హోటల్ ఉన్న ఫస్ట్ ఫ్లోర్ ను తమ ఆఫీస్ కోసం వినియోగించుకోవాలని, దానిని ఎక్స్టెండ్ చేయాల్సి ఉందని చెప్పారు. త్వరలోనే 100 ఏళ్లు (యానివర్సరీ-వార్షికోత్సవం) జరుపుకోనున్న వీరాస్వామి హోటల్ కు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు. 

క్రౌన్ ఎస్టేట్స్ నిర్ణయంపై వీరస్వామి రెస్టారెంట్ కో ఓనర్ రంజిత్ మతరాని హైకోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. లీజు కొనసాగించేలా ఆదిశించాల్సిందిగా కోర్టును కోరనున్నారు. అయితే క్రౌన్ ఎస్టేట్ నిర్ణయం రాయల్ ఫ్యామిలీ (బ్రిటన్ రాజవంశీయుల కుటుంబం) కి కూడా సంతృప్తిగా ఉండదని అంటున్నారు. ఎన్నో ఏళ్లుగా బ్రిటిష్-ఇండియన్ ఫుడ్ అందిస్తూ వస్తున్న రెస్టారెంట్ ను మూసివేత గురించి మరోసారి ఆలోచించాలని రెస్టారెంట్ తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. చూడలి మరి కోర్టు లీజు విషయంలో జోక్యం చేసుకుంటుందేమో.