స్వదేశంలో ఇంగ్లాండ్ బుధవారం (ఆగస్టు 21) నుంచి శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకంగా మారనుంది. ఈ సిరీస్ కు ఇంగ్లాండ్ జట్టు కొంతమంది స్టార్ ఆటగాళ్ల సేవలను కోల్పోయింది. ముఖ్యంగా బెన్ స్టోక్స్ గాయంతో ఈ సిరీస్ కు దూరం కావడం ఆ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. స్టోక్స్ స్థానంలో ఇంగ్లాండ్ కెప్టెన్ గా ఆలీ పోప్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్ వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. స్టోక్స్ తో పాటు జాక్ క్రాలీ ఈ సిరీస్ కు దూరమయ్యాడు అతని స్థానంలో డాన్ లారెన్స్ జట్టులో చేరాడు.
స్వదేశంలో ఇంగ్లాండ్ ఇటీవలే వెస్టిండీస్‌ను 3-0 తేడాతో చిత్తు చేశారు. అండర్సన్, బ్రాడ్ లేకపోవడం స్టోక్స్, క్రాలీ గాయాల కారణంగా దూరమవ్వడంతో కుర్రాళ్లతో నిండిన ఇంగ్లాండ్ జట్టు శ్రీలకంతో సిరీస్ ఛాలెంజ్ గా మారింది. బుధవారం (ఆగస్టు 21) మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరగనున్న తొలి టెస్టుకు ఇప్పటికే ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ను ప్రకటించారు. మరోవైపు శ్రీలంక అండర్ డాగ్ గా ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతుంది. ఇంగ్లాండ్ ను వారి దేశంలో అడ్డుకొని నిలబడడం లంకకు అసాధ్యంగానే కనిపిస్తుంది.
తొలి టెస్ట్ కు ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11:
డాన్ లారెన్స్, బెన్ డకెట్, ఒల్లీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్
• England Cricket has handed over the responsibility to two young players for their upcoming Sri Lanka series.
— Sristi Roy (@Everybody19_) August 19, 2024
• England Test team captain Ben Stokes is injured but he will guide his players during this series. #EnglandCricket #ENGvsSL pic.twitter.com/9Cc9N3zT1N