
టీమిండియాతో ఐదు టెస్ట్ ల సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ జట్టును వరుస గాయాలు వెంటాడుతున్నాయి. సిరీస్ కు మరో రెండు నెలల సమయం ఉన్నప్పటికీ ఇంగ్లీష్ జట్టుకు ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు దూరమయ్యారు. ఇప్పటికే గాయంతో ఈ మెగా సిరీస్ కు స్టార్ పేసర్ మార్క్ వుడ్ దూరం కాగా.. తాజాగా ఓలి స్టోన్ ఆ లిస్ట్ లో చేరాడు. మోకాలి గాయం కారణంగా స్టోన్ సర్జరీ చేయించుకోవడంతో ఈ ఇంగ్లాండ్ పేసర్ కు 14 వారల రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఇండియాతో జరగనున్న సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
స్టోన్ 14 వారాల పాటు పునరావాసంలో ఉంటాడు. ఈ క్రమంలో అతను హోమ్ సీజన్‌కు దూరమవుతాడు. 31 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్ ఈ ఏడాది చివర్లో జరిగే యాషెస్‌కు పూర్తి ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు. గత నెలలో నాటింగ్‌హామ్‌షైర్ ప్రీ-సీజన్ పర్యటనలో స్టోన్ కుడి మోకాలికి గాయం అయింది. ఆ తర్వాత స్కానింగ్ లు నిర్వహించగా.. అతనికి సర్జరీ అవసరమని డాక్టర్లు సూచించారు. ఇంగ్లాండ్ వేదికగా 2024లో శ్రీలంకతో రెండు టెస్టుల్లో స్టోన్ ఏడు వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శన కారణంగా పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లకు ఎంపిక చేశారు. దురదృష్టవశాత్తు స్టోన్ కు ప్లేయింగ్ 11 లో చోటు దక్కలేదు. ఓవరాల్ గా స్టోన్ తన కెరీర్‌లో ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 23.52 సగటుతో 17 వికెట్లు పడగొట్టాడు.
►ALSO READ | LSG vs MI: మార్ష్, మార్కరం మెరుపులు.. ముంబై ముందు బిగ్ టార్గెట్
భారత్ తో జరగబోయే 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ తో ఇంగ్లాండ్ తమ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-2027 సైకిల్‌ను ప్రారంభించనుంది. జూన్ 20 నుండి ఆగస్టు 4 వరకు ఈ మెగా సిరీస్ జరగనుంది. లీడ్స్‌లోని హెడ్డింగ్లేలో జూన్ 20 న తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లోని మిగతా నాలుగు టెస్టులకు ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్ ఓవల్ వేదికలు కానున్నాయి. 2021-22 చివరిసారిగా భారత్ ఇంగ్లాండ్ లో పర్యటించింది. ఈ సిరీస్ 2-2 తో సమంగా ముగిసింది.ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్, భారత్ చివరిసారిగా టెస్ట్ సిరీస్ ఆడాయి.
Another blow to England’s fast bowling stocks with Olly Stone ruled out of their Test summer with a knee injury 🤕
— ESPNcricinfo (@ESPNcricinfo) April 4, 2025
Stone will be out of action for 14 weeks following surgery and is targeting a return to full fitness by August pic.twitter.com/kkdhhGDaQE
ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ 2025 టెస్ట్ సిరీస్ షెడ్యూల్
1వ టెస్ట్: జూన్ 20-24 - హెడ్డింగ్లీ, లీడ్స్
2వ టెస్టు: జూలై 2-6 - ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
3వ టెస్టు: జూలై 10-14 - లార్డ్స్, లండన్
4వ టెస్టు: జూలై 23-27 - ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
5వ టెస్టు: జూలై 31-ఆగస్టు 4 - కియా ఓవల్, లండన్