న్యూఢిల్లీ: డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్, ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా హర్యానాకు చెందిన టెన్నిస్ ప్లేయర్ హిమని మోర్‌ను పెండ్లి చేసుకున్నాడు. కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో కొన్ని రోజుల కిందటే వీరి వివాహ వేడుక జరిగింది.
ఇందుకు సంబంధించిన రెండు ఫొటోలను నీరజ్ ఆదివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ షాకిచ్చాడు. ‘నా కుటుంబంతో కలిసి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించా’ అని పేర్కొన్నాడు. హిమని ప్రస్తుతం యూఎస్‌లో స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ చదువుతోంది.