Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో రెండు పతకాలు.. మను బాకర్‌కు ఢిల్లీలో గ్రాండ్ వెల్కమ్

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో రెండు పతకాలు.. మను బాకర్‌కు ఢిల్లీలో గ్రాండ్ వెల్కమ్

పారిస్ ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన భారత షూటింగ్ సంచలనం మను భాకర్ ఇండియాకు చేరుకున్నారు. ఆమెకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత మను భాకర్, ఆమె కోచ్ జస్పాల్ రాణాను భారీ పుష్పగుచ్ఛాలతో దండలు వేస్తూ వారిని ఆహ్వానించారు. మను బాకర్ ను చూడడానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు. 

మను భాకర్..10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాలు సాధించింది. తద్వారా, ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత ప్లేయర్‌గా, మహిళా షూటర్‌గా చరిత్ర సృష్టించింది. అయితే ఒలింపిక్స్ లో వరుసగా మూడు పతకాలు సాధించి చరిత్ర సృష్టించాలనుకున్న మను భాకర్ కు నిరాశ ఎదురైంది. శనివారం (ఆగస్టు 3) జరిగిన మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో 4వ స్థానంలో నిలిచిన మను భాకర్ కాంస్య పతకాన్ని తృటిలో కోల్పోయింది. 

మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్.. పారిస్ ఒలింపిక్స్‌‌‌‌లో ఇండియాకు తొలి మెడల్‌‌‌‌గా బ్రాంజ్‌‌‌‌ అందించింది. మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్, సరబ్జోత్ సింగ్ తో కలిసి మరో కాంస్య పతకాన్ని సాధించింది. ఇప్పటివరకు భారత్ సాధించిన మూడు మెడల్స్ లో మను బాకర్ నుంచి రెండు మెడల్స్ రావడం విశేషం.