గోల్డ్ గెలిచా.. ఇక నా యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫాలోవర్లు పెరగాలి

గోల్డ్ గెలిచా.. ఇక నా యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫాలోవర్లు పెరగాలి

ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన స్విమ్మర్ డానియెల్ విఫెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. 28 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గిన ఐర్లాండ్ క్రీడాకారుడిగా నిలిచాడు. పోడియంపై స్వర్ణం అందుకొని.. తమ దేశ జెండా ఎగురుతుండగా భావోద్వేగంతో అతను కన్నీటి పర్యంతం అయ్యాడు. 

ఇంత పెద్ద విజయం తర్వాత అతను అనూహ్య కోరిక కోరాడు. ఈ మెడల్ గెలిచిన తర్వాత అయినా యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన ఫాలోవర్లు పెరుగుతారని  23 ఏండ్ల విఫెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. స్విమ్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్విమ్మర్ల గురించి యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తాను చెప్పే విషయాలను ప్రజలు చూడాలని అతను కోరుకుంటున్నాడు.