
హుషారు, రౌడీబాయ్స్ తర్వాత దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి రూపొందించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’(Om Bheem Bush). శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ కామెడి ఎంటర్టైనర్ నుండి మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
లేటెస్ట్గా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుని U/A సర్టిఫికేట్ ను అందుకుంది.సెన్సార్ వాళ్ళు ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ రివ్యూ ఇచ్చినట్టు సమాచారం.రన్‍టైమ్ 2 గంటల 15 నిమిషాలు (135 నిమిషాలు)గా ఉండనుంది. తక్కువ రన్‍టైమ్‍తో వస్తుండటం..ఈ ఎంటర్‌టైన్‍మెంట్ మూవీకి ప్లస్‍గా అయ్యే ఛాన్స్ ఉందట.
గుప్తనిధుల కోసం ముగ్గురు యూనివర్సిటీ స్టూడెంట్స్ చేసిన అన్వేషణను క్రేజీగా చూపించారట.కుటుంబ ప్రేక్షకులను, యువతను మెప్పించేలా ఈ సినిమా ఉండబోతునట్లు తెలుస్తోంది. అలాగే క్లైమాక్స్ లో భారీ ఎమోషన్ తో ఊహించని ట్విస్ట్ లు ఉంటాయట. హీరోకి శ్రీవిష్ణు కామిక్ టైమింగ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్స్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉండనున్నాయట.
Also Read: సింగర్‌గా మారిన సుహాస్ హీరోయిన్..ఏ సినిమాకు పాడిందో తెలుసా?
దీంతో సెన్సార్ రివ్యూ రిపోర్ట్స్ పూర్తిగా పాజిటివ్‌గా ఉండడంతో..శ్రీ విష్ణుకి మంచి హిట్ అందుకునే అవకాశం ఉంది.రీసెంట్గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆడియన్స్ ని వీపరీతంగా ఆకట్టుకుంది. ఇక సెన్సార్ రివ్యూ కూడా పాజిటివ్ గా రావడంతో సమ్మర్ ట్రీట్ అనే చెప్పుకోవాలి. మరో 3 రోజులు ఆగితే..ఓం భీమ్ బుష్ అసలు కథేంటనేది తెలుస్తోంది.
It is a 𝐔/𝐀 for #OmBheemBush 💥💥
— UV Creations (@UV_Creations) March 19, 2024
Pillaki, youth ki, peddhalaki, andhariki wholesome entertainment ❤️🔥
Grand release worldwide on March 22nd. Bookings open soon!#OBBTrailer ❤️🔥❤️🔥
▶️ https://t.co/f8oRnmyCYs
Directed by @HarshaKonuganti#OBB@sreevishnuoffl @PriyadarshiPN… pic.twitter.com/qTzWEfi6mm
యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి బ్రోచేవారెవరురా సినిమాలో ఫుల్ గా నవ్వించిన శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్.. ఇప్పుడు ఈ సినిమాతో కూడా అదే మ్యాజిక్ క్రియేట్ చేస్తారో లేదు చూడాలి.