లోక్ సభలో శివుడి ఫొటో చూపించిన రాహుల్ : స్పీకర్ అభ్యంతరం

లోక్ సభలో శివుడి ఫొటో చూపించిన రాహుల్ : స్పీకర్ అభ్యంతరం

లోక్ సభలో ప్రతిపక్ష నేతగా తొలి ప్రసంగంతోనే తనదైన స్టైల్ లో ప్రధాని మోడీపై సెటైర్లు వేశారు రాహుల్ గాంధీ.రాహుల్ శివుడి ఫోటో చూపించి శివుడి నుండే తాను ప్రేరణ పొందానని అన్నారు. రాహుల్ శివుడి ఫోటో చూపించటంపై స్పీకర్ ఓం బిర్లా అడ్డునుకున్నారు.ప్రతిపక్షంలో ఉన్నందుకు గర్వపడుతున్నానని, సంతోషంగా ఉందని అన్నారు రాహుల్ గాంధీ. రాంజ్యాంగానికి రక్షణగా ఉంటామని, అధికారంకంటే నిజం గొప్పదని అన్నారు రాహుల్.ఇండియా కూటమి నేతల్ని ఈడీ,సీబీఐ వేధిస్తోందని అన్నారు.  

రాజ్యాంగంపై దాడి జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే తమని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు పోరాడతామని అన్నారు రాహుల్ గాంధీ. తన ఎంపీ పదవి, ఇంటిని లాక్కున్నారని అన్నారు. ఈడీ నుండి 55గంటల విచారణ ఎదుర్కున్నానని అన్నారు రాహుల్ గాంధీ.

రాహుల్ గాంధీ ప్రసంగింపై ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అభ్యంతరం వ్యక్తం చేయగా, శివుడి ఫోటోను, రాజ్యాంగాన్ని చూపిస్తే తప్పా అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు.