హర్యానా మాజీ సీఎం ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ( ఐఎన్ఎల్ డీ ) చీఫ్ ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూశారు. శుక్రవారం ( డిసెంబర్ 20, 2024) గురుగ్రామ్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు చౌతాలా.
1989లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఓం ప్రకాష్ చౌతాలా.. రికార్డు స్థాయిలో నాలుగు పర్యాయాలు హర్యానా సీఎంగా వ్యవహరించారు. చౌతాలా చివరగా 1999 నుండి 2005 వరకు హర్యానా సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. చౌతాలా మృతి పట్ల రాష్ట్రానికి చెందిన ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.