హంగ్ ను నివారించేందుకే కాంగ్రెస్​తో పొత్తు... ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా

హంగ్ ను నివారించేందుకే కాంగ్రెస్​తో పొత్తు... ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్​లో హంగ్ అసెంబ్లీని నివారించేందుకే ఎన్నికలకు ముందే తాము కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నామని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ మేరకు ఆదివారం దాల్ సరస్సులో జరిగిన షికారా ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘‘ఎన్నికలు ముగిసిన తర్వాత మేం పొత్తు పెట్టుకోవచ్చు.

హంగ్ అసెంబ్లీ ఏర్పడకుండా ప్రజలకు అవకాశం కల్పించేందుకు ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడ్డాం. ఎట్టి పరిస్థితుల్లోను హంగ్ అసెంబ్లీ ఏర్పాటు కాదు. హంగ్ ఏర్పడితే ఎల్జీ పాలన పొడిగించాలన్నది బీజేపీ ఆలోచన” అని ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు.