జమ్మూకశ్మీర్ సీఎంగా ఓమర్ అబ్దుల్లా ప్రమాణం

జమ్మూకశ్మీర్ సీఎంగా ఓమర్ అబ్దుల్లా ప్రమాణం

జమ్ముకశ్మీర్  సీఎంగా నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా  ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీనగర్ లో లెఫ్టినెంట్ గవర్నర్  మనోజ్ సిన్హా .. ఒమర్ అబ్దుల్లాచే ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారోత్సవానికి  కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే,   రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ హాజరయ్యారు.  ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా శ్రీనగర్ లో భద్రతను కట్టదిట్టం చేశారు.

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. 90 అసెంబ్లీ స్థానాలున్నజేకేలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని దక్కించుకుంది అలయెన్స్. నేషనల్ కాన్ఫరెన్స్ శాసన సభాపక్షనేతగా ఒమర్ అబ్దుల్లాను ఆపార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎలక్షన్ రిజల్ట్ తర్వాత జమ్ముకశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా రాష్ట్రపతి పాలనను కేంద్రం ఎత్తేసింది. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లీయర్ అయింది.

Also Read : అపార్ట్ మెంట్లో అగ్నిప్రమాదం