అప్పుడప్పుడు విదేశీయుల తెలివితేటలను భారతీయులతో పోలుస్తూ సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ వైరల్ అవుతుంటాయి. అవి చదివాక మరీ ఇంత తెలివి తక్కువుగా ఎక్కడుంటారు. వీరికి పని లేక ట్రోల్ చేస్తున్నారు అనుకుంటాం. కానీ ఈ కథనాన్ని చదివితే వారి తెలివితేటలు మీమ్స్ లో చెప్పిన వాటి కంటే పెద్దగా ఏముండవు అనిపించక మానదు.
చాక్లెట్ మిల్క్ దేనితో తయారు చేస్తారన్న దానిపై యూఎస్ డైరీకి చెందిన ఇన్నోవేషన్ సెంటర్ సర్వే నిర్వహించగా.. ఏడు శాతం మంది అమెరికన్లు ఎరుపు - గోధుమ ఆవుల నుండి వస్తాయని ఓటేశారట. ఆవులు గోధుమ రంగులో ఉండటం వల్లే.. చాక్లెట్ మిల్క్ బ్రౌన్ కలర్‍లో ఉంటాయన్నది వారి అభిప్రాయం.
నిజానికి చాక్లెట్ పాలు ఎలాంటి పాడి ఆవుల నుండైనా తయారుచేస్తారు. నలుపు, తెలుపు, గోధుమ రంగు ఆవులు అంటూ తేడాలుండవు. అయితే రంగు, రుచి మాత్రం కోకో గింజల వల్ల వస్తుంది. చూశారుగావీరి తెలివితేటలు ఆ రేంజ్ లో ఉన్నాయో..
ఇదొక్కటే కాదు.. ఒక పరిశోధకుల బృందం కూరగాయలను ఎలా పండిస్తారని కాలిఫోర్నియా పాఠశాలల్లోని కొందరు విధ్యార్ధులను అడగ్గా.. వారిచ్చిన సమాధానినికి ఆశ్చర్యపోయారట. సగం మందికి దోసకాయలు, ఉల్లిపాయలు, పాలకూర వంటివి భూమిలో మొక్కలు నాటడం వస్తాయని తెలియదట. అంతేకాదు పదిమంది అమెరికన్ పౌరుల్లో ముగ్గురికి జున్నును పాలతో తయారుచేస్తారని తెలియదట. వీరి తెలివితేటలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.