
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్(Akshay kumar) కీ రోల్ చేస్తున్న మూవీ ఓ మై గాడ్-2(Oh my god2). బాలీవుడ్‌లో తొమ్మిదేళ్ల క్రితం విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన ఓ మై గాడ్ (OMG) సినిమాకు సీక్వెల్ గా వస్తోంది ఈ సినిమా. అమిత్ రాయ్ (Amit Roy) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్‌లు, టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేయగా.. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ (OMG 2 Trailer) విడుదల చేశారు మేకర్స్.
ALSO READ:లండన్ లో సితార.. ఫొటోస్ క్షణాల్లో వైరల్
ఫస్ట్ పార్టులో కృష్ణుడిగా కనిపించిన అక్షయ్.. ఓ మై గాడ్-2లో శివుడిగా దర్శనమిస్తున్నారు. పరేశ్ రావల్ స్థానంలో మీర్జాపూర్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి (Pankaj Tripathi) భక్తుడిగా కనిపిస్తాడు. మొదటి పార్టులో లాగే ఓ మై గాడ్-2లో కూడా పంకజ్ కేసు దేవుడిపై ఉండనుంది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. విడుదలైన క్షణాల్లోనే మిళియన్స్ వ్యూస్ తో దూసుకుపోతోంది ఈ ట్రైలర్. ఈ సినిమా తొలిపార్టుకు మించి ఉండబోతుందని, పక్కా బ్లాక్ బస్టర్ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక వాకావ్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో యామి గౌతమ్ లాయర్‌గా కనిపించనుంది.