తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు

తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు

తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ నగర శివారుల్లో తాజాగా మరో కేసు రికార్డ్ అయ్యింది. హయత్ నగర్ లో 27 ఏళ్ల యువకుడికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. సూడాన్ నుంచి హైదరాబద్ వచ్చిన వ్యక్తి ఒమిక్రాన్ బారిన పడినట్లు వైద్యఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో అతడ్ని గచ్చిబౌలి టిమ్స్ కు తరలించారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు 25కు చేరాయి. 

మరోవైపు అధికారులు అప్రమత్తం అయ్యారు. హయత్ నగర్ లో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులకు కూడా టెస్టులు నిర్వహించారు. అయితే ఈ కొత్త వేరియంట్ సోకిన వ్యక్తి వ్యాక్సిన్ తీసుకోలేదని వైద్య అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రతీ ఒకరు విధిగా కోవిడ్ టీకా తీసుకోవాలంటున్నారు. కరోనా గైడ్ లైన్స్ తప్పకుండా పాటించాలని చెబుతున్నారు.